ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎమ్మెల్యే రేఖా నాయక్

-

తెలంగాణ బీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్‌ రాని వారు.. గోడలు దూకేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే రేఖా నాయక్ రూపంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి వికెట్‌ పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను నిన్న ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలోని 119 స్థానాలకు గానూ 115 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉండే అభ్యర్థుల లిస్ట్‌ను రెడీ చేశారు. అంతేకాకుండా.. 7గురు సిట్టింగ్‌లను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఏడుగురిలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ కూడా ఉన్నారు. ఈ తరుణంలోనే.. కాంగ్రెస్ పార్టీలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ భర్త శ్యామ్ నాయక్ చేరారు. దీంతో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు ఎమ్మెల్యే రేఖా నాయక్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version