పువ్వాడ అజయ్ DNAలోనే లోపం ఉందని ఫైర్ అయ్యారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. రేణుకా చౌదరి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను టార్గెట్ చేశారు. కురవి మండలం బలపాల గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రేణుక చౌదరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….పువ్వాడ అజయ్ దుష్టుడు, దుర్మార్గుడని ఆరోపించారు. ఆయన డిఎన్ఏలోనే ఏదో లోపం ఉందని రేణుక చౌదరి తీవ్ర వాక్యాలు చేశారు. ఎవరు నిస్సహాయంగా ఉండొద్దని…. ఓటు అనే ఆయుధంతో పువ్వాడను తరిమి కొట్టాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు.
భవిష్యత్తు బాగుండాలంటే తుమ్మలను గెలిపించాలని, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ చరిత్రలో ఈ ఎన్నికలు మిగిలిపోతాయని నాగేశ్వరరావు చెప్పారు. ఈ అరాచకాలను అడ్డుకోవడానికి ఓటర్లు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.