తెలంగాణ సీఎంతో ఆరు ఫార్మా కంపెనీల ప్రతినిధులు భేటీ..!

-

రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పి తద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. తాజాగా దేశంలో పేరొందిన పలు ఫార్మా కంపెనీల
తో ఎంవోయూలు  కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రానికి దాదాపు రూ.5,260 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు.

టీఎస్ఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్న ఈ సమావేశంలో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెల కొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కాగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news