జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని BRS నేతల రాజీనామా ?

-

సంగారెడ్డి BRS పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని సంగారెడ్డి BRS నేతలు రాజీనామా సిద్ధం అవుతున్నారు. BRS లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేరుతారని నియోజకవర్గంలో జోరు గా ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లోనే BRS లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేరుతారని వార్తలు వస్తున్నాయి.

దీంతో అలర్ట్ అయ్యి హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు నివాసానికి వెళ్లారు సంగారెడ్డి BRS నాయకులు. జగ్గారెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని సంగారెడ్డి BRS నాయకులు పట్టు పడుతున్నారు. ఒక వేళ చేర్చుకున్న వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కే సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ జగ్గారెడ్డి కి టికెట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు నాయకులు. దీంతో మీ అభ్యర్థనను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news