మేయర్ పై అవిశ్వాస తీర్మాణం.. బీఆర్ఎస్ కీలక నేత ప్రకటన

-

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ పై  అవిశ్వాస తీర్మానంపై ఎల్లుండి పార్టీ మీటింగ్ నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్  కీలక నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణాలు ఆగిపోయాయని అన్నారు.

Tha

ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. GHMC కౌన్సిల్ లో అధికార కాంగ్రెస్ కంటే.. తమ పార్టీ సభ్యులే ఎక్కువ ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ స భ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేల లంచ్ మీటింగ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో దాదాపు రెండున్నర గంటల సేపు ఈ సమావేశం కొనసాగింది.

Read more RELATED
Recommended to you

Latest news