Retired Justice Narasimha Reddy: విద్యుత్ కొనుగోలు అంశం విచారణ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ నరసింహ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు అంశం విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుండి తప్పుకున్నారు రిటైర్డ్ జస్టిస్ నరసింహ రెడ్డి.
దీంతో తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లో మంతనాలు చేస్తున్నారు. కలెక్టర్ల సమావేశం నుంచి ముఖ్యమంత్రి గదిలోకి వెళ్లిపోయిన సీఎం రేవంత్… సుప్రీంకోర్టులో విద్యుత్ కమిషన్ చైర్మన్ జాన్ నర్సింహరెడ్డిని మార్చి కొత్త జడ్జిని నియమించాలన్న ధర్మాసనం నిర్ణయంపై చర్చిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత కొత్త జడ్జి పేరు చెప్పాలని ఆదేశించడంతో అడ్వకేట్ జనరల్ తో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు చేస్తున్నారు. సీనియర్ జడ్జిల పేర్లు సూచించారట అడ్వకేట్ జనరల్. కాసేపట్లో కొత్త జడ్జి పేరును ప్రకటించనున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.