తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను తాము చేయకూడదని.. ప్రతీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ చాలా సందర్భాల్లో తప్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలోని పలు గ్రామాల్లో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ లో చనిపోయిన వారికి రాజకీయ నాయకుల అండదండలతో అందజేస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు పింగర్ ఫ్రింట్ పడని, నడవలేని స్థితిలో ఉన్న వృద్దులకు పంచాయితీ సెక్రెటరీ ఫింగర్ ప్రింట్ తో పాటు సంతకం ఉంటే డబ్బులు తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని విచ్చలవిడిగా సద్వినియోగం చేసుకుంటున్నట్టు సమాచారం. తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బ్రతికున్నా చనిపోయానని పెన్షన్ ఇవ్వడం లేదంటూ ప్రజావాణిలో వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకెళ్తే.. ఖైరతాబాద్ బీజేఆర్ నగర్ కి చెందిన 59 ఏళ్ల రుక్నమ్మ భర్త చనిపోయాడు. ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు చేసుకుంది. రుక్నమ్మ కూడా చనిపోయినట్లు రికార్డుల్లో ఉందని, బతికున్నట్టు నిరూపించుకోవాలని అధికారులు అంటున్నారని రుక్నమ్మ కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడుతుంది. కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైందని, ఇప్పుడు మాత్రం పెన్షన్ ఇవ్వడం లేదని రుక్నమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.