జనవరి 5 లోపే జీతాలు వేయాలని రేవంత్ సర్కారు నిర్ణయం !

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. జనవరి 5 లోపే జీతాలు వేయాలని రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపి అయినా సరే 5వ తారీకు లోపే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు వేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్లు సమాచారం.

Revanth government’s decision to pay salaries before January 5

గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు తెలపడంతో వారి రుణం తీర్చుకొనే దిశగా రేవంత్ సర్కారు అడుగులు వేస్తోందని సమాచారం. ఆ దిశగా ఈనెల వేయాల్సిన రైతుబంధు/ఇతర సంక్షేమ పథకాల నిధులు ఆపి జనవరి 5 లోపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు జమ చేయాలని నూతన ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news