ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాజెక్టులు, కంపెనీలు, పనులను ప్రారంభిస్తున్న విషయం విధితమే. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సమయంలో శంకుస్థాపన చేసి తమ హయాంలోనే పూర్తి అయిన పనులు ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు పనులకు శంకుస్థాపన చేసే దమ్ము లేదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలోనే నిన్న ప్రారంభించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తయిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఆలస్యానికి కారణం ఎవరో త్వరలో చెబుతానని సచివాలయంలో కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత విగ్రహాన్ని రాష్ట్ర సచివాలయంలో పెట్టవద్దని.. తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.