మన ఆరోగ్యం మనం రోజూ తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే శరీరానికి పోషణ అందించే ఆహారాలను రోజువారి డైట్ లో చేసుకోవాలి.
జామ పండును డైలీ తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా కడుపులో పేగుల కదలికలు చురుకుగా ఉంటాయి. మలబద్ధకం వంటి సమస్యలను సులభంగా దూరం అవుతాయి. అంతేకాదు విరోచనాల సమస్యతో బాధపడే వారికి జామ ఆకులు వరంలా పనిచేస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది:
తక్కువ గ్లిసమిక్ ఇండెక్స్ కలిగిన జామ పండును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
విటమిన్ సి:
నారింజలో ఉండే దానికంటే ఎక్కువగా జామ పండులో విటమిన్ సి ఉంటుంది. దీని కారణంగా రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా జలుబు, జ్వరాలు వంటివి రాకుండా ఉంటాయి.
చెడు కొవ్వును తగ్గిస్తుంది:
గుండెకు చెడు కొవ్వు చేటు చేస్తుంది. చెడు కొవ్వును తగ్గించే ఈ యాంటీ ఆక్సిడెంట్లు అయిన లైకోపీన్ వంటివి జామ పండులో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల జామ పండ్లను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
ఒత్తిడిని దూరం చేస్తుంది:
జామ పండులో మెగ్నీషియం స్థాయిలు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా కండరాలు, నరాలు రిలాక్స్ అవుతాయి. కాబట్టి మీకు ఎలాంటి ఒత్తిడి అనిపించదు.
కంటి చూపును మెరుగుపరుస్తుంది:
విటమిన్ సి తో పాటు విటమిన్ ఏ కూడా జామ పండులో ఉండడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తుంది. జామ పండును రోజువారి డైట్ లో తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది.