ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని..మళ్లీ గెలిచేందుకు కుట్రలు – రేవంత్‌ రెడ్డి

-

ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని..మళ్లీ గెలిచేందుకు కుట్రలు చేస్తున్నాడని సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరారు జూపల్లి కృష్ణారావు. ఢిల్లీలోని మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ లో కేసీఆర్ కు వ్యతిరేకంగా పునరేకీకరణ జరుగుతోందని.. కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రాష్ట్రాన్ని కేసీఆర్ ఫణంగా పెట్టారని ఫైర్‌ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటం ముమ్మరం చేసిందని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రజల ఆకాంక్షలు నెరవెరుస్తుందని నమ్ముతున్నారన్నారు. సీనియర్ల తో పాటూ కొత్తగా చేరిన వాళ్ళకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తాం అని చెప్పామని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రయివేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో గెలిచేందుకు కుట్ర చేస్తున్నారని.. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version