ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటర్లను ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ చేసిన తప్పా అని అడిగారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోతున్నారని అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఉద్యమకారుడంటే సర్వం కోల్పోయిన వారని రేవంత్ అన్నారు. కానీ తానూ ఉద్యమం కారుడినే అని చెప్పుకుంటున్న కేసిఆర్ మాత్రం వందలాది ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకొని చక్కగా అందులో కాలం గడుపుతున్నారని విమర్శించారు. దేశ నిర్మాణంలో యువతే కీలకమని వ్యాఖ్యానించిన రేవంత్.. “వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. ప్రగతి భవన్ తాళాలు పగులకొట్టి దానికి డా.బీఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంగా మార్చుతామని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ న్యాయం చేస్తామని ప్రజలకు రేవంత్ హామీ ఇచ్చారు. పాదయాత్రలో పారిశుద్ధ్య కార్మికులు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఆటో డ్రైవర్లు ,గీత కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగించారు.