కేంద్రం వేసిన కమిటీ లో అధిర్ రంజన్ కొనసాగలేం అని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక ఎన్నికల్లో మోడీ..అమిత్ షా..గల్లీ గల్లీ తిరిగారు. అయినా.. ఓడగొట్టి..మోడీ కి కాలం చెల్లింది అని నిరూపించారు. మణిపూర్ అల్లర్ల పై అవిశ్వాస తీర్మాణం లో మోడీ రెండున్నర గంటల పాటు కాంగ్రెస్ గురించే మాట్లాడారు. మణిపూర్ గురించి మాట్లాడకుండా .. తప్పించుకున్నాడని పేర్కొన్నారు.
నవంబర్ లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి అన్నారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తోంది అని తేలిపోయింది. బీజేపీ భాగస్వామ్య బీఆర్ఎస్ కూడా ఒడిపోతుంది అని సర్వే నివేదికలు వచ్చాయి అని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ పాతాలం లోకి వెళ్లాల్సి వస్తుంది అని వన్ నేషన్ తెచ్చాడు మోడీ. దీన్ని ఇండియా కూటమి వ్యతిరేకం కాదన్నారు. బీఆర్ఎస్ వైఖరి ఏందో చెప్పాలి అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్.. జులై 6 2018 లో వన్ నేషన్..వన్ ఎలక్షన్ కి మద్దతు గా లేఖ రాశారుజమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ అనుకూలం అని లేఖ ఇచ్చారు. కేటీఆర్ ని పంపించి జమిలి కి అనుకూలం అనే లేఖ ఇచ్చారు అని స్పష్టం చేశారు. బీజేపీ విధానం కి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది అన్నారు.