ఏపీలో ఇంధన పన్నులు అత్యధికంగా ఉన్నాయని బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఇంధన పన్నులు ఎందుకు ఎక్కువగా ఉన్నాయో..? రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ సమాధానం చెప్పాలన్నారు. పెట్రోలియంపై కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పన్ను తగ్గించింది. అయినప్పటికీ ఏపి ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట నిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పన్నులను తగ్గించడం లేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీపై రూ.200, ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్లపై రూ.400 తగ్గించింది. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వేస్తున్నా.. ఏపీలో అభివృద్ధి మాత్రం కన్పించడం లేదన్నారు. ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు పురంధేశ్వరి. వైసీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి లో ఎందుకు వెనుకంజ ఉందని ప్రశ్నించారు. కేంద్రం ఇన్ని వసతులు సమకూర్చుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదన్నారు.