నేటి నుంచి 5 రోజుల్లో14 చోట్ల రేవంత్‌ రెడ్డి సభలు.. షెడ్యూల్ ఇదే

-

కాంగ్రెస్‌ పార్టీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో జోరు పెంచనుంది. ఈ క్రమంలోనే ముఖ్య నేతలంతా ప్రచారంలో హోరెత్తించనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 11వ తేదీ వరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఐదు రోజుల్లో 14 నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉమ్మడి మహబూబ్​నగర్​లో పర్యటిస్తారు.

రేవంత్ రెడ్డి ఐదు రోజుల పర్యటన షెడ్యూల్

  • 7న అలంపూర్​, గద్వాల, మక్తల్​ బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
  • 8న ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, జహీరాబాద్‌
  • 9న పాలకుర్తి, సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌
  • 10న కామారెడ్డి
  • 11న బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురిలో రేవంత్ రెడ్డి సభలు ఉంటాయి.
  • ఈ నెల 9న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే సభలో మైనార్టీ డిక్లరేషన్‌ విడుదల చేస్తారు. రేవంత్‌ పాల్గొనే సభలకు పార్టీ జాతీయ, ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలు ముఖ్య అథితులుగా రానున్నారు.  హైదరాబాద్‌లో 9న జరిగే సభకు జాతీయస్థాయి మైనార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. రేవంత్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఇతర నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news