ఈ పదేళ్లలో ప్రజల ప్రాథమిక హక్కులనుకేసీఆర్ కాలరాశారు : రేవంత్ రెడ్డి

-

నిరసనలు తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను ఈ పదేళ్లలో కేసీఆర్ కాలరాశారని మండిపడ్డారు. ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉంది అని విమర్శించారు. సచివాలయంలోకి ప్రజాప్రతినిధులను, మీడియా మిత్రులను రానివ్వడం లేదని తెలిపారు. కేసీఆర్‌.. నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్‌ అని ధ్వజమెత్తారు.

‘తెలంగాణ సాధికారతతో రాష్ట్రంలో ఎన్నో మార్పులు చూస్తామన్న యువత ఆకాంక్షలు అడియాశలు అయ్యాయి. కేసీఆర్ పాపాలు పండాయి.. మేడిగడ్డ కుంగింది. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్‌సీ విఫలమైంది. కేసీఆర్‌ ఇచ్చిన పాత హామీలనే అమలుచేయాలని ప్రజలు కోరుతున్నారు. పదేళ్లుగా కేసీఆర్ మోసం చేస్తున్నారని ప్రజలకు అర్ధమైంది. బంగారు తెలంగాణ ఫలాలు ఎవరికి అందుతున్నాయి? నిర్దిష్టమైన విధానాలతోనే మేం ప్రజల వద్దకు వెళ్తున్నాం. కేసీఆర్ పాలన ఎలా ఉందో.. యువత, రైతులు, మహిళలు బాగా చెబుతారు. విధివిధానాలపైనే ఎన్నికలకు వెళ్దాం.. రండి. చుక్క మందు పోయవద్దు.. పైసలు పంచవద్దు. బీఆర్ఎస్​కు ధైర్యం ఉంటే మా సవాళ్లను స్వీకరించాలి. మేడిగడ్డ పిల్లర్‌ మూడు అడుగులు కుంగిపోయింది. అడుగున ఇసుక ఉందని నీటిపారుదలశాఖ ఇంజినీర్లకు తెలియదా? నీటిపారుదల శాఖను మొదట్నుంచీ హరీశ్‌రావు, కేసీఆరే చూస్తున్నారు.’ అని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version