తెలంగాణ ప్రజలకు రేవంత్‌ లేఖ.. ప్రమాణ స్వీకారానికి ఇదే నా ఆహ్వానం

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 1.28 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రేపు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఓ సందేశం పంపించారు.

‘‘తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీనవర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో డిసెంబరు 7న ప్రమాణస్వీకారం చేయబోతున్నా. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం’’ అని రేవంత్‌ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news