ఇవాళ 3 నియోజక వర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. నేడు కరీంనగర్, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగానే… ఇవాళ సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ జన జాతర సభ ఉంటుంది.
అనంతరం సాయంత్రం 6.30 గంటలకు వరంగల్ ఈస్ట్ రోడ్ షోలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొంటారు. రాత్రి 7.45 గంటలకు వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు సీఎం రేవంత్. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.