కేజ్రివాల్ కు మరో షాక్.. NIA విచారణకు దిల్లీ ఎల్జీ సిఫార్సు

-

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై, ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పట్లో కేజ్రీవాల్ కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ఆయన చుట్టూ నెమ్మదిగా ఉచ్చు బిగుస్తోంది. కేజ్రీపై సోమవారం రోజున మరో పెద్ద పిడుగు పడింది. అయితే ఈ పిడుగు దిల్లీ ఎజ్జీ వీకే సక్సేనా రూపంలో వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఖలిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నుంచి సుమారు రూ.134 కోట్ల మేర నిధులను స్వీకరించారని కేజ్రీవాల్‌పై ఫిర్యాదు అందిందని కేంద్ర హోంమంత్రిత్వశాఖకు దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) వి.కె.సక్సేనా లేఖ రాశారు. దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ ఫిర్యాదును వరల్డ్‌ హిందూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ జాతీయ కార్యదర్శి ఆషూ మోంగియా చేసినట్లు లేఖలో ఎల్జీ పేర్కొన్నారు. 1993లో దిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో దోషి.. దేవేంద్ర సింగ్‌ భుల్లార్‌ను విడుదల చేసేందుకు కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ పార్టీ భారీగా నిధులను తీసుకుందన్నది ఫిర్యాదులో ప్రధాన ఆరోపణ.

Read more RELATED
Recommended to you

Latest news