TSPSC ని కాదు.. కేసీఆర్ ని రద్దు చేయాలి : రేవంత్ రెడ్డి

-

TSPSC నిర్వహించే పలు పరీక్షల్లో జరిగే తంతును అందరూ చూస్తూనే ఉన్నారని..ఇటీవలే గ్రూపు 1 పరీక్ష రద్దు అయిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు.  ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. TSPSCని కాదు.. సీఎం కేసీఆర్ ని రద్దు చేయాలన్నారు రేవంత్ రెడ్డి. 

తనపై రూ.100 కోట్లకు పరువు నష్టం  దావా వేశావు.. వంద కోట్లు ఇచ్చి ఎంత తిట్టినా ఓకేనా కేటీఆర్ అని ప్రశ్నించారు. ఉద్యోగ ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. కోదండరామ్ చెప్పినట్టు 14న జాతీయ రహదారులపై బైఠాయిస్తామని పేర్కొన్నారు. పాలమూరు-హైదరాబాద్ రహదారిపై పహార కాస్తానని పేర్కొన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను ఇస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. రాజకీయ పునరావాసంగా మార్చారు. కేటీఆర్ నీకు పరువు ఉంటే పరువు నష్టం దావా వేయవు. టీఎస్పీఎస్సీలో ఇన్ని జరిగిన సీఎం కేసీఆర్ ఏం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. రాజకీయ ఖాళీలను అఘమేఘాల మీద ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఉద్యోగ ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version