ఇసుక మీద ఎవరైనా ప్రాజెక్టులు కడతారా? : రేవంత్ రెడ్డి

-

ఇసుక మీద ఎవరైనా ప్రాజెక్టులు కడతారా అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ నిర్మించిన సాగర్‌, శ్రీశైలం, కల్వకుర్తి ప్రాజెక్టులు ఎంత వరదొచ్చినా తట్టుకుని నిలబడ్డాయని రేవంత్ అన్నారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులు 50 ఏళ్లుగా వరదలకు తట్టుకుని నిలబడ్డాయని తెలిపారు.

కానీ.. కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం పాజెక్టు వచ్చీ రాగానే కుంగిపోయిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇసుక మీద ప్రాజెక్టులు ఎవరైనా కడతారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేకమేడ అనుకున్నారా? అని నిలదీశారు. ఇసుకపై బ్యారేజ్‌ కట్టడం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని పేర్కొన్నారు. ఇసుకపై కట్టిన మేడిగడ్డ.. ఇక అణాపైసాకు పనికిరాదని.. అన్నారం అక్కరకు రాదని వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, అన్నారం మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ మండిపడ్డారు.

‘ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్‌ పనులు ప్రారంభించింది. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వరకు మార్చారు. 38 వేల 500 కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరాన్ని లక్షా 51 వేల కోట్లకు పెంచారు. గోదావరి జలాలు వస్తే మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయింది.’ అని రేవంత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news