వాహనాలకు ఉన్న TS ను TG గా మారుస్తాం – రేవంత్‌ రెడ్డి

-

వాహనాలకు ఉన్న TS ను TG గా మారుస్తామని పీసిసి చీఫ్ రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ లోని ఆర్‌ అక్షరాన్ని తీసేసి…TS ఉండేలా కేసీఆర్‌ డిజైన్‌ చేశారని… కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే.. వాహనాలకు ఉన్న TS ను TG గా మారుస్తామని పీసిసి చీఫ్ రేవంత్‌ రెడ్డి తెలిపారు.

సెప్టెంబర్ 17 2022 – సెప్టెంబర్ 17 2023 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది..తెలంగాణ ను కేసీఆర్ తెచ్చారని ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారన్నారు. అందే శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ ను రాష్ట్ర విభజన జరిగిన తరువాత దానిని పట్టించుకోలేదని ఆగ్రహించారు.

కాంగ్రెస్ వచ్చిన తరువాత అందే శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ ను అధికార గీతం గా చేస్తామని వెల్లడించారు. టీఆరెస్ సృష్టించిన తెలంగాణ తల్లి కాకుండా ..సబ్బడ్డ వర్గాలకు సంబంధించిన తెలంగాణ తల్లి ని గ్రామగ్రామాన విగ్రహాలు ప్రతిష్ఠిస్తామని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో జాతీయ జెండా తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కి ప్రత్యేక ప్లాగ్ ఉంటుంది..మనం వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఫ్లాగ్ రూపొందిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version