ఈ వయస్సులో పార్టీ మారడానికి సిగ్గుండాలన్న రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పోస్ట్ వైరల్

-

పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కీలక నేతలంతా పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకొని సికింద్రాబాద్ ఎంపీగా బరిలో ఉండగా.. ఇప్పడు బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ గా ఉన్న కే కేశవరావు పార్టీని వీడనున్నారు. ఈ నేపధ్యంలోనే కేకే పార్టీ మారడంపై బీఆర్ఎస్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన ఓ నేతపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను పోరు చేసింది.

ఆ వీడియోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ వయస్సులో పార్టీ మారడానికి సిగ్గుండాలి అని, సచ్చెముందల ఏ రోగం వచ్చిందని పార్టీ మారుతున్నారని, పార్టీ ఆయనకు ఏం తక్కువ చేసిందని, చచ్చేముందల నిన్ను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పార్టీ మరాడానికి సిగ్గుండాలని మాట్లాడిన వీడియోకి, కే కేశవరావు ఫోటోను జతచేసి, రేవంత్ రెడ్డి ఇక్కడ ఈయన గురించేనా మాట్లాడేది? సిగ్గు ఉండాలి అన్నాడేంటి? అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version