రేవంత్ కి ఒక్క క్షణం కూడా సీఎంగా కొనసాగే అర్హత లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న కమిట్ మెంట్ ని తెలియజేస్తా ఉన్నాయి. ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పుకున్న తరువాత నాకు పరిపాలన చేత కావడం లేదు. ఇది నాతో కావడం లేదని ఒప్పుకున్న తరువాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా పదవీకి అర్హుడు కాడు అని పేర్కొన్నారు.
తక్షణమే పదవీకి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జగదీశ్ రెడ్డి. వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు నిజమే అయితే వెంటనే రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ ఆర్థిక, పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. రేవంత్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పెరిగింది రాష్ట్ర ఆదాయం. రేవంత్ పాలనలో తగ్గిపోయిందని మంత్రుల ఆదాయం మాత్రం అంతంత పెరిగిందని విమర్శించారు.