బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి మైండ్ పని చేయడం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడగానే కేటీఆర్ కి మెడ, కాళ్ల నొప్పులు పోయాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆయనకు మెదడు పని చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని చెప్పారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.8లక్షల కోట్లు అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ దోచుకున్నంత దేశంలో ఎవ్వరూ దోచుకోలేదని మండిపడ్డారు.
మరోవైపు ఉద్యోగులు, ప్రజల మధ్య సీఎం రేవంత్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే అందాల పోటీలకు డబ్బులుంటాయి. కానీ ఉద్యోగులకు ఇవ్వడానికి లేవా అని ప్రశ్నించారు. అప్పులపై పూటకో మాట మాట్లాడుతున్నారు. సర్కార్ నడుపుతున్నారా లేదా సర్కస్ నడుపుతున్నారా..? అప్పు పుట్టడం లేదంటున్న రేవంత్.. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ఎలా చేపడుతారని ప్రశ్నించారు.