తెలంగాణ కేబినెట్ భేటీ ఇవాళ జరుగనుంది. ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో షరతులతో కూడిన అనుమతిని ఎన్నికల సంఘం ఇచ్చింది. కేవలం అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే, శనివారమే కేబినెట్ భేటీ జరగాల్సి ఉండగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో సమావేశం వాయిదా పడింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్‌పై సానుకూలంగా స్పందించిన ఈసీ.. క్యాబినెట్ సమావేశానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ తెలంగాణ కేబినేట్ మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో రైతు బంధు, రుణ మాపీ, తెలంగాణ రాష్ట్రంలో రెండు జిల్లాలకు పేరు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును, ఉమ్మడి వరంగల్ లోని ఏదైనా మరో జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.