మరోసారి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో డాక్టర్ లోకేష్ హల్ చల్ చేశాడు. సీఎం జగన్ విదేశాలకు వెళ్ళే సమయంలో ఎయిర్ పోర్ట్ లో అనుమానాస్పదంగా సంచరించిన డాక్టర్ లోకేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే… 151 సెక్షన్ కింద కేసు నమోదు చేసి గుండె పోటు అనటంతో డాక్టర్ లోకేష్ ను ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు.
ఇక తాజాగా ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ వచ్చాడు డాక్టర్ లోకేష్. ఈ సందర్భంగా లోకేష్ నుంచి శాటిలైట్ ఫోన్ గుర్తించింది ఎయిర్ పోర్ట్ సిబ్బంది. దీంతో గన్నవరం పోలీసులకు సమాచారం అందించింది ఎయిర్ పోర్ట్ స్టాఫ్. శాటిలైట్ ఫోన్ వినియోగానికి ఇక్కడ అనుమతి లేకపోవటంతో ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. ఇక కేసు నమోదు పై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.