కోడంగల్ లో రేవంత్ రెడ్డి భారీ విజయం

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫలితం పై దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీని ముందుండి నడిపించాడు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కి ధీటుగా రోజుకు నాలుగు ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

కోడంగల్ నియోజకవర్గానికి వస్తే.. రేవంత్ రెడ్డి ప్రారంభం నుంచే ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పోటీ ఇవ్వలేకపోయారు. 6, 7 రౌండ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాస్త ముందంజలో కనిపించినా ఆ తరువాత మళ్లీ రేవంత్ రెడ్డి పుంజుకొని విజయం సాధించారు. రేవంత్ రెడ్డి కోడంగల్ లో 32,800 మేజార్టీతో విజయం సాధించారు. కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ముందంజలో ఉన్నారు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version