హుజూర్ నగర్ లో భారీ మెజార్టీతో ఉత్తమ్ కుమార్ గెలుపు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అనుకున్నట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 50వేల మెజార్టీ సాధిస్తానని ధీమాగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం కోసం అందరూ ఎదురు చూశారు.


ప్రధానంగా పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీని ముందుండి నడిపించాడు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కి ధీటుగా రోజుకు నాలుగు ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించి విజయంలో కీలక పాత్ర పోషించారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 46,748 మెజార్టీతో గెలుపొందారు. సైదిరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడిన ఓట్లను చూసి దిమ్మ తిరిగిపోయింది. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్ఆర్ఐ సైదిరెడ్డి.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తాజాగా ఓడిపోయాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అతని భార్య పద్మావతిరెడ్డి కూడా కోదాడ నుంచి విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version