హైదరాబాద్ మూసీపై రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం

-

లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్ లో హైదరాబాద్ లో మూసీనదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, థేమ్స్ నది తరహాలో అభివృద్ధి, తదితర అంశాలను ఆయనతో చర్చించారు.

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో భేటీ అయ్యారు. నదీ తీరాన జరిపే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నదీ సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నట్లు, నదీ జలాలను కాపాడడం ఉంచటం, ఎంచుకున్న ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనముండే విధంగా ఈ ప్రాజెక్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా చర్యలుంటాయని సీఎం అన్నారు. మూసి నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ, సహజ వనరులకు విఘాతం లేకుండా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. నది పరీవాహిక ప్రాంత అభివృద్ధి చేపట్టటంలో సీఎం చూపుతున్న దార్శనికతకు, బ్రిటిష్ హై కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, ఎకో టూరిజంకు తమ సహకారం ఉంటుందని ఎల్లిస్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version