ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై సీఎం రేవంత్ శుభవార్త !

-

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై రేవంత్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు, షెడ్యూల్ జారీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. ఏ. శరత్ జీవో 17ను ఈ రోజు విడుదల చేశారు. అలాగే టీచర్లలో ఆయా కేడర్లకు సంబంధించిన బదిలీలు మరియు పదోన్నతులకు గాను రాష్ట్ర విద్యా శాఖలో చేపట్టిన మాదిరిగానే రోజువారీ షెడ్యూళ్ళను రిలీజ్ చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1600 పైగా గిరిజన ప్రాథమిక మరియు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 3,700 మంది ఉపాధ్యాయులకు ఈ అవకాశం లభించింది. ఉపాధ్యాయుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 2018 తరువాత పూర్తిస్థాయిలో బదిలీలు, పదోన్నతులు చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు, పదోన్నతులు ఒకదానితో ఒకటి ముడిపడినందువల్ల ఈ షెడ్యూల్ నెల రోజులపాటు కొనసాగుతుంది.

మల్టీ జోనల్ స్థాయి ఉపాధ్యాయులకు గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు, జిల్లా స్థాయి ఉపాధ్యాయులకు ఐ.టీ.డీ.ఏ.లలో ప్రాజెక్టు అధికారులు మరియు మైదాన ప్రాంతాలలో కలెక్టర్లతో కూడిన కమిటీల ఆమోదం మేరకు జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు ఈ బదిలీలు, పదోన్నతులు రేపటి నుంచి షెడ్యూలు ప్రకారం చేపడుతారు. దీనికి గాను మొదటిసారిగా పూర్తి స్థాయిలో ఆన్లైన్ అప్లికేషన్ మరియు వెబ్ కౌన్సిలింగ్ సదుపాయాన్ని గిరిజన సంక్షేమ శాఖ కల్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news