సీఎం రేవంత్ చెప్పిందే చేస్తున్నారు. నగరంలో మూసీ శుద్ధీకరణ కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు డెవలప్మెంట్‌పై దృష్టి సారించిన సర్కార్ కార్యాచరణ వేగంగా అమలు చేస్తోంది.గురువారం తెల్లవారుజాము నుంచి అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేపట్టారు.ముందుగా గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్,ఆశ్రమ్‌నగర్‌లో కొలతలు తీసుకున్నారు. ఇక పాతబస్తీలోని చాదర్‌ఘాట్, మూసానగర్,శంకర్‌నగర్‌లో సర్వే చేపట్టారు.కూల్చబోయే నిర్మాణాలపై మార్క్ చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో 55 కిమీ పరిధిలో మొత్తం 12 వేల ఆక్రమణలను అధికారులు గుర్తించారు.
వాటిని కూల్చే బాధ్యతలను హైడ్రాకు ప్రభుత్వం అప్పగించనుంది. అయితే, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి పలు కుటుంబాలతో మాట్లాడి ఒప్పించారు. తాజాగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన ప్రభుత్వం పునరావాసం,నష్టపరిహారం,డబుల్ ఇండ్ల కేటాయింపులపై కలెక్టర్ల సమక్షంలో ప్రతి కుటుంబానికి వివరాలు అందజేసేలా షెడ్యూల్ రూపొందించనుంది.