కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై రాష్ట్రంలో వాడివేడి చర్చ జరుగుతోంది. తాజాగా ఈ డిక్లరేషన్‌పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. డిక్లరేషన్ సభ కాదు.. అధికారం రానే రాదనే ఫ్రస్ట్రేషన్ సభగా కేటీఆర్ అభివర్ణించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్…. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై ట్విటర్‌లో విమర్శించారు. దీనిపై రేవంత్ రెడ్డి రీ ట్వీట్ చేశారు.
మా డిక్లరేషన్ దళిత గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్ అంటూ కేటీఆర్ ట్వీట్‌కు బదులిచ్చారు. ‘మా డిక్లరేషన్ … దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు. గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదు. మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదు. నేరెళ్ళ ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత – బీసీ బిడ్డల పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదు. అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తమ డిక్లరేషన్… దళిత – గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది కాదని రేవంత్ స్పష్టం చేశారు అందుకే… యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటేనని.. అదే “కేసీఆర్ ఖేల్ ఖతం – బీఆర్ఎస్ దుఖాన్ బంద్” అని అన్నారు.
మా డిక్లరేషన్ దళిత – గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్.
1. మా డిక్లరేషన్ … దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
2. మా డిక్లరేషన్… ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు.
3. మా డిక్లరేషన్… గిరిజన రిజర్వేషన్లు 12… https://t.co/oxzAFlzOLQ
— Revanth Reddy (@revanth_anumula) August 28, 2023