సీఎం రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే కాబోతున్నాడు – KTR

-

సీఎం రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే కాబోతున్నాడని… రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటాడని బాంబు పేల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.మహారాష్ట్ర, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అన్నారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం పై బుధవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

సిరిసిల్ల లోనూ ఎల్ఆర్ఎస్ పీ నిరసన తెలపాలన్నారు. భారస ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. డిసెంబర్ 19న అన్ని హామీలు నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పారని చెప్పారు. కరీంనగర్కు బండి సంజయ్ చేసిందేమీ లేదని, మతం, అయోధ్య పేరు చెప్పి ఓట్లు దండుకోరాలని భారతీయ జనతా పార్టీ చూస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ నెల 12న కరీంనగర్ లో ‘కదన భేరి’ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news