ఆదాయపు పన్ను కట్టే వారికి రైతు బంధు కట్..!

-

తెలంగాణ రాతులకు బిగ్ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. రైతు బంధు అమలు పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దింతో ఆదాయపు పన్ను కట్టే వారికి రైతు బంధు కట్ అంటూ.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

పన్ను చెల్లించే వారికి రైతుబంధు ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారట. కేవలం భూమిని సాగు చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి. ఆదాయపు పన్ను కట్టే రైతులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు సాయం అందించారో? ఎన్ని నిధులు విడుదల చేశారన్న దానిపై స్పష్టత లేదు.రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు సాయం అందినట్లు తెలుస్తుండగా…. ఎకరం భూమి గల కొందరు రైతులు కూడా తమకు పెట్టుబడి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు మర్చి నెలాఖరులోగా రైతుబంధు డబ్బులు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news