తెలంగాణలో ఇకపై గ్రామీణ రోడ్లకు కూడా టోల్ ఛార్జీలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ (HAM) ద్వారా రహదారుల అభివృద్ధి చేయాలని నిర్ణయించిందట ప్రభుత్వం. ఈ మోడల్లో 40 శాతం ప్రభుత్వ నిధులతో, 60 శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనుందట ప్రభుత్వం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక అటు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. త్వరలో 14,236 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.