రూ.7వేల కోట్లు ఎవ్వరి ఖాతాలోకి పోయాయి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించేందుకు తాను సిద్ధం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రజలను ఆందోళనకు గురి చేయడం సరికాదు అన్నారు. గడిచిన 4 నెలల్లో మేము రూ.26వేల కోట్ల అప్పు చెల్లించామని.. మేము వచ్చే సరికి ఖజానాలో రూ.3927 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ రూ.7వేల కోట్లు ఉన్నాయంటోంది. మరీ ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి పోయిందో వారు చెప్పాలని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పరిపాలన చేయలేదని చాలా మంది విమర్శించినట్టు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేశామని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందన్నారు. ప్రజలను ఆందోళనలకు నెట్టే ప్రచారం కూడా మంచిది కాదన్నారు. రైతు బంధు ఇవ్వలేదని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయన్నారు. రైతు బంధు కోసం రూ.7వేల కోట్లు ఉంచామని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version