రూ. 396.09 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు సీఎం శంకుస్థాప‌న

-

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న సొంత జిల్లా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు రేవంత్ శంకుస్థాప‌న చేశారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఇందిరా మ‌హిళా శ‌క్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

మహబూబ్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్ల విలువైన‌ వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో నిర్మించ‌బోయే బాలికల హాస్టల్ నిర్మాణానికి, దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ రూర‌ల్‌లో రూ.3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి, గండీడ్‌లో రూ.6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి, పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు, రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news