వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు BRSకు కొత్తేం కాదు – ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

-

వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు BRSకు కొత్తేం కాదన్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. BRS సైనికులకు ఒక విజ్ఞప్తి..ఈ వెన్నుపోట్లు, ద్రోహాలు, కుట్రలు, దాడులు పార్టీకి కొత్తేం కాదు. ప్రజల గుండెల్లో మనకు స్థానం పదిలంగా ఉన్నంత వరకు ఏ శక్తీ మన ప్రస్తానాన్ని ఆపలేదని తెలిపారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

rs praveen kumar call to brs

అందుకే విలువైన సమయాన్ని వృదా చేయకుండా, ఎంతటి త్యాగానికైనా వెనుకాడకుండా, మనను నమ్ముకున్న ఆ ప్రజల వద్దకే వెళ్లి, వాళ్లకు వాస్తవాలను వివరించి, రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ద్రోహుల చెంప ఛెల్లుమనేలా విజయభేరి మోగిద్దామని పిలుపునిచ్చారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. పదండి ముందుకు..పదండి తోసుకు.. పోదాం పోదాం పైపైకి…కదం తొక్కుతూ, పదం పాడుతూ హృదయాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం పైపైకి అంటూ బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ లో ఉత్సాహం నింపారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version