నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్-బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

-

రానున్న లోక్సభ ఎన్నికల కోసం భారత్ రాష్ట్ర సమితి, బహుజన సమాజ్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీకి రెండు లోక్ సభ స్థానాలను కేటాయించింది. ఇరు పార్టీల నేతల చర్చల అనంతరం పొత్తుపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలను బీఎస్పీకి కేటాయించినట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్-బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆయనకు బీఆర్ఎస్ తరఫు నుంచి పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. అలాగే నాగర్కర్నూల్ ఎంపీ స్థానాన్ని గెలిచి కేసీఆర్కు కానుకగా ఇస్తామని చెప్పారు. మరోవైపు పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ టికెట్ ప్రవీణ్ కుమార్కు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆయన విజయం సాధించేలా పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version