రేవంత్ రెడ్డి అమెరికాలో మీటింగ్ పెడితే.. అంతా ఆంధ్రా వారు వచ్చారు – RS ప్రవీణ్‌ కుమార్‌

-

రేవంత్ రెడ్డి అమెరికాలో మీటింగ్ పెడితే అంతా ఆంధ్రా వారు వచ్చారని చురకలు అంటించారు బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. ఇవాళ తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యుద్ధ భూమిగా ఉండేదని… వరంగల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా నేను జయశంకర్ ను కలిశానని తెలిపారు.

RS praveen kumar on cm revanth reddy usa telangana

తెలంగాణలో ఎన్ కౌంటర్లు లేకుండా నక్సలిజం సమస్యకు పరిష్కారం చూపాలని అడిగాను… ఆంధ్రా పోలీసులు తెలంగాణ పోలీసులను ఉమ్మడి రాష్ట్రంలో ఇబ్బందులు పెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జయశంకర్ పోలీసులకు దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ మళ్లీ ప్రమాదం అంచున ఉంది… దొడ్డిదారిన తెలంగాణ వనరులను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణపై ఢిల్లీ నుండి కుట్ర జరిగే అవకాశం ఉంది.. అదృశ్య శక్తులు తెలంగాణను కబలించే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news