ప్రశ్నిస్తే కేటీఆర్ పై కేసు పెడతారా? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-

దళిత గిరిజన వర్గాల పక్షాన పోరాడుతున్న కేటీఆర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా బుక్ చేస్తారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలను నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి పైన అట్రాసిటీ కేసు వెయ్యాలి కదా అని అన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని మండిపడ్డారు. లీకేజీ మాఫియాకు, కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను ప్రజలకు చెప్పడం నేరమా??.. కేటీఆర్ దళితులను ఏం అన్నారని? ఎక్కడ ఎవరిని దూషించారని అట్రాసిటీ కేసు పెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారు… బీఆరెస్ పార్టీ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టినందుకా.. సచివాలయానికి అడగకుండానే అంబేడ్కర్ పేరు పెట్టినందుకా? దళితులకు పది లక్షల దళిత బంధు పథకం అమలు చేసినందుకా? దళితుల కోసం వందలాది గురుకుల పాఠశాలలు స్థాపించినందుకా? దళిత – గిరిజన విద్యార్థులకు కోడింగ్ భాష నేర్పించి విదేశాలకు పంపినందుకా? అని ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

80 మంది గురుకుల విద్యార్థుల ప్రాణాలు తీసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అట్రాసిటీ కేసు పెట్టాలని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేయకుండా, పక్కదారి పట్టించినందుకు కేసు నమోదు చేయాలని అన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ను దళితుడు అని సంభోదించి  అవమానించినందుకు కేసు పెట్టాలని తెలిపారు.

లగచర్ల గిరిజనుల భూములు అక్రమంగా కబ్జా చేసినందుకు రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలని వ్యాఖ్యానించారు. ‘సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ అసమర్థుడే. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డికి పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం కూడా చేత కాలేదు. కేటీఆర్, మన్నె క్రిషాంక్, దిలీప్ కొణతంలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.’ అని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version