కేటీఆర్కు సెల్యూట్ చేసిన పాపానికి.. ప్రభుత్వ ఉద్యోగిని బలి చేసిన రేవంత్ సర్కార్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహించారు. లగచర్ల రైతుల పరామర్శకు వెళ్లినప్పుడు.. కేటీఆర్కు సెల్యూట్ చేశారు సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంజీవ రెడ్డి. దాంతో ఆయనపై పగబట్టి.. బేడీల వ్యవహారాన్ని అంటగట్టి సస్పెండ్ చేసినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇదేనా ప్రజాపాలన అంటూ.. ట్విటర్ మాధ్యమంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహించారు.
రేవంత్ రెడ్డి అజ్ఞానానికి, అరాచకానికి పాపం నిన్న మరో ప్రభుత్వ ఉద్యోగి సంజీవరెడ్డి బలిపశువు అయ్యాడని చురకలు అంటించారు. మొన్న రైతులకు బేడీలు వేసిన అమానవీయ సంఘటనలో సంబంధం లేని సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంజీవ రెడ్డిని అకారణంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. నిజానికి ఈ విషయంలో సస్పెండ్ చేయాల్సింది ప్రస్తుత కొడంగల్ ఎమ్మెల్యే, హోంమంత్రి, సీయం రేవంత్ రెడ్డిని అంటూ నిప్పులు చెరిగారు. లగచర్ల రైతుల భూములను బలవంతంగా గుంజుకునే కుట్ర చేసిందెవరు? తన చేతికి మన్ను అంటకుండా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను, ఇతర అధికారుల ను రైతుల మీదికి ఉసిగొల్పిందెవరు? అంటూ రేవంత్ పై సీరియస్ అయ్యారు.
రేవంత్ రెడ్డి అజ్ఞానానికి, అరాచకానికి పాపం నిన్న మరో ప్రభుత్వ ఉద్యోగి సంజీవరెడ్డి బలిపశువైండు.
మొన్న రైతులకు బేడీలు వేసిన అమానవీయ సంఘటనలో సంబంధం లేని సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సంజీవ రెడ్డిని అకారణంగా సస్పెండ్ చేశారు.
బేడీలు జైలు అధికారులు వెయ్యరు, ఆర్మడ్ రిజర్వు(AR)… pic.twitter.com/QVXCgky1p4
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 14, 2024