ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ అల్పపీడనం ఉన్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పనుందని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. రెండు రోజుల్లో… ఇది పశ్చిమ వాయువ్యంగా ప్రయాణించి తమిళనాడు తీరం…. దిశగా వెళ్లనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది.

ఈ అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఈ నెల 17, 18 తేదీలలో కోస్తా అలాగే రాయలసీమ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా నెల్లూరు తిరుపతి ప్రకాశం చిత్తూరు అన్నమయ్య జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ.