ట్వీట్‌ని రీపోస్ట్ చేస్తే కేసులు పెడుతున్నారు – ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

-

ట్విట్టర్‌లో ట్వీట్‌ని బీఆర్ఎస్ కార్యకర్తలు రీపోస్ట్ చేస్తే సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ అనేది ఎవరినైనా అశ్లీలంగా అగౌరవ పరిస్తే పెడతారు.. కానీ బీఆర్ఎస్ కార్యకర్తల మీద విచ్చలవిడిగా ఈ యాక్ట్‌తో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు.

దిలీప్ కొణతం, రేవతిల మీద మీరు సెక్షన్ 111 ఎలా పెడుతారు.. అసలు మీరు చట్టం చదువుకున్నారా? అని ఆగ్రహించారు. సోషల్ మీడియాలో ప్రజల బాధలను పోస్ట్ చేస్తే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా అవుతుంది? అని నిలదీశారు. ఇవాళ తెలంగాణలో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తుంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అన్నారు. ఎఫ్ఐఆర్‌లు అన్ని గాంధీ భవన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి.. ఆర్డర్లు ముఖ్యమంత్రి ఆఫీస్ నుండి వస్తుందని ఆగ్రహించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఎలా పని చేయాలో నేను చెప్తా వినండన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news