ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై పెను భారం అంటూ RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాక్యలు చేశారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సు ప్రీ టికెట్స్ విడుదల చేశారు. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. బస్సులో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు , పలువురు ఎమ్మెల్యేలు ప్రయాణించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు బస్సులో ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి.. తిరిగి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అయితే.. ఈ ఫీ బస్సుపై RS ప్రవీణ్ కుమార్ స్పందించారు. మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు ఆర్టీసీపై పెను భారాన్ని మోపబోతోందని తెలంగాణ రాష్ట్ర BSP చీఫ్ RS ప్రవీణ్ కుమార్ అన్నారు.
“ఇది ఆర్టీసీ కార్మికుల జీవితాలపై కూడా ప్రభావం చూపబోతోంది. గతంలో చాలా గ్రామాలకు బస్సులను బంద్ చేశారు. వాటిని పునరుద్ధరిస్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలింది. ఆటో డ్రైవర్లు తమకు ప్యాసింజర్లు దొరకక రోడ్లమీద పడతామేమోనని భయపడుతున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలి” అని ట్వీట్ చేశారు.