హనుమాన్ చాలీసాతో గుండెకు వైద్యం.. యూపీ డాక్టర్ స్పెషాలిటీ

-

ఉత్తర్​ ప్రదేశ్ కాన్పూర్​లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు రోగులకు వినూత్నంగా చికిత్స అందిస్తున్నారు. గుండె సంబంధిత రోగాలకు చికిత్స చేసే వైద్యుడు నీరజ్.. ఈ రోగాల్లో ఒత్తిడి చాలా ముఖ్యమైన అంశమని.. అందుకే హృద్రోగ రోగుల్లో ఒత్తిడి తగ్గించడమనేది చాలా ప్రాధాన్యమైన అంశమని తెలిపారు. అందుకే ఆయన రామాయణం, హనుమాన్ చాలీసా లాంటి పుస్తకాలతో గుండె వైద్యం చేస్తున్నారు. వీటిని చదివిన రోగుల ఆరోగ్యం మెరుగుపడినట్లు చెబుతున్నారు. ఓ వైపు మందులతో రోగులకు చికిత్స అందిస్తూనే, మరోవైపు ఇలాంటి మత గ్రంథాల సాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు నీరజ్. వీటని చదవడం వల్ల వారికి ఏకాగ్రత కుదిరి.. ఒత్తిడి తగ్గుతోందని మనసు ప్రశాంతంగా ఉంటుందని వివరించారు.

“గుండె సంబంధిత సమస్యతో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడంటే ఏమవుతుందోనని వారికి భయంగా ఉంటుంది. ఆ భయం కాస్త పెరిగి తీవ్ర మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. అప్పటికే శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు మానసికంగానూ అనారోగ్యానికి గురవుతారు. అది గుండెకు చాలా చేటు చేస్తుంది. ఇలాంటి కండిషన్​లో ఉన్న రోగులకు ఒకప్పుడు మానసిక థెరపీతో పాటు మ్యూజిక్ థెరపీ చేయించేవాళ్లం. కానీ క్రమంగా దాని ప్రభావం కూడా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు మతగ్రంథాలను ఎంచుకున్నాం. దేవుడిపై నమ్మకంగా ఉండే వారికి ఈ గ్రంథాలను చదవమని చెబుతున్నాం. వారు అలా ఆ పుస్తకాలు చదువుతూ ఏకాగ్రత కుదిరి మానసకి ప్రశాంతతను పొందుతున్నారు. దీనివల్ల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరకంగానూ వారు ఆరోగ్యవంతులవుతున్నారు. ” – నీరజ్​, సీనియర్​ కార్డియాలజిస్ట్​

Read more RELATED
Recommended to you

Latest news