రాఖీ సందర్భంగా హఠాత్తుగా పెరిగాయి ఆర్టీసీ బస్సు ఛార్జీలు. రాఖీ పండగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30% వరకు పెంచింది. పండగల సీజన్‌లో టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఉందని తెలిపారు ఆర్టీసీ అధికారులు.

హైదరాబాద్ ఉప్పల్ నుండి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వెళ్లేందుకు ఎక్స్ ప్రెస్ బస్సు ఎక్కినప్పుడు, ఒక్కరికి రూ. 220 బదులు రూ. 330 వసూలు చేశారని ఆరోపించారు ప్రయాణికులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, ఆ భారాన్ని పురుషులపై మోపుతున్నారని అసహనం తెలిపారు.