తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత కొద్ది రోజుల నుంచి సమ్మె చేపడుతామని చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ప్రత్యక్ష సమ్మెకు శంఖం మోగించింది. మే 06వ తేదీ నుంచి ఆర్టీసీ సమ్మె ఉంటుందని ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ , లేబర్ కమిషనర్ కు సమ్మెకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు.
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మే 06న అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ వెల్లడించింది. జనవరి 27న తమ డిమాండ్లు పరిష్కరించాలని లేదంటే సమ్మెకు దిగుతామని ఇది వరకే ఆర్టీసీ జాక్ సంస్థకు నోటీసులు ఇచ్చింది. సమ్మె నోటీసులు ఇచ్చినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె నిర్వహించేందుకే సిద్ధం అయింది. ఈ మేరకు లేబర్ ఆఫీస్ లో సమావేశం అయిన నేతలు మే 06 నుంచి సమ్మె చేసేందుకు తేదీ నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఎంత దూరం అయినా వెళ్తామని హెచ్చరించారు.