కల్తీ కల్లు తాగి 15 మందికి సీరియస్

-

ఈ మధ్య కాలంలో కల్తీ కల్లు, కల్తీ మద్యం తో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో అనేక మంది కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలయ్యారు. వీరిలో 15 మందికి సీరియస్ ఉండటంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

చికిత్స పొందుతున్న వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలియజేశారు. గ్రామంలోని బాధితులందరూ మతిస్థిమితం కోల్పోయినట్టు వింతగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. సమాచారం తెలుసుకున్నటువంటి అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్తితిని సమీక్షిస్తున్నారు. కల్తీ కల్లు తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఈ మధ్య కాలంలో చాలా చోటు చేసుకున్నాయి. కల్తీ కల్లును అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news